కరక్కాయలతో ఘరానా మోసం

Update: 2018-07-16 11:56 GMT

తామిచ్చిన కరక్కాయలు పొడి చేసి ఇస్తే 1000/- కి 300/- లాభం ఇస్తానని చెప్పి అమాయకుల నుంచి రూ.3 కోట్ల మోసానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ కూకట్ పల్లిలో వెలుగులోకి వచ్చింది. కూకట్ పల్లిలో ఆరునెలల క్రితం సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. కరక్కాయలు పొడికి బాగా డిమాండ్ ఉందని, కంపెనీ ఇచ్చిన కరక్కాయలను పొడి చేసి ఇస్తే కేజీ కి 300 లాభం ఇస్తామని స్థానిక మహిళలకు నమ్మబలికారు.

మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని

తమ వద్ద నుండి ఆయుర్వేదిక్ కంపనీ వాళ్లు, పతంజలి కంపెనీ వాళ్లు కొంటారని నమ్మబలికారు. అయితే పొడి చేయడానికి కరక్కాయలు కూడా తమ వద్దే తీసుకోవాలని చెప్పిన కంపెనీ... కేజీ కరక్కాయలకు రూ.1000 చొప్పున బాధితుల నుండి వసూలు చేశారు. ఇలా వేల మంది లక్షల్లో పెట్టుబడి పెట్టారు. మహిళలు డబ్బులు వస్తాయనే ఆశతో స్కిన్ ఎలర్జీలు వచ్చినా కష్టపడి కరక్కాయలను పొడి చేశారు. మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని డబ్బులతో పరారయ్యారు కంపెనీ కేటుగాళ్లు. నెల్లూరు జిల్లాకు చెందిన మల్లికార్జున ముప్పల అనే వ్యక్తి ఈ మొత్తం మోసంలో ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. మహిళలు కేపీహెచ్ బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News