వంగవీటి వస్తానంటే…?

వంగవీటి రాధా తనకు మంచి మిత్రుడని, ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే తానే దగ్గరుండి జగన్ వద్దకు తీసుకెళ్తానని మంత్రి కొడాలి నాని అన్నారు. [more]

Update: 2019-12-02 14:34 GMT

వంగవీటి రాధా తనకు మంచి మిత్రుడని, ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే తానే దగ్గరుండి జగన్ వద్దకు తీసుకెళ్తానని మంత్రి కొడాలి నాని అన్నారు. వంగవీటి రాధా వస్తానంటే ఎప్పుడైనా పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమని, తాను జగన్ ను ఒప్పించగలనని కొడాలి నాని చెప్పారు. జగన్ మీద ఈగ వాలితే ఒప్పుకునే వాడిని కానన్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తారన్నారు. చంద్రబాబు వయసు మీద పడి ఎలా అంటే అలా మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ ల వల్లనే పార్టీ సర్వనాశనం కాబోతుందని కొడాలి నాని జోస్యం చెప్పారు. తనకు మంత్రి పదవి అంటే ఇష్టం లేదని, జగన్ ఎప్పుడు రాజీనామా చేయమన్నా చేస్తామని తెలిపారు. ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News