డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కన్నుమూశారు. కావేరీ ఆసుప్రతి వైద్యులు కరుణానిధి మృతి చెందినట్లు ధృవీకరించారు. 94 ఏళ్ల వయస్సున్న కరుణానిధి గత కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు. వారం రోజుల క్రితం కరుణ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబసభ్యులు కావేరి ఆసుపత్రికి తీసుకువచ్చారు. కరుణానిధికి మూత్రాశయ నాళంలో ఇన్ ఫెక్షన్ సోకడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే రోజురోజుకూ కరుణ ఆరోగ్యం విషమిస్తుండటంతో వైద్యులుకూడా తమకు చేతులెత్తేశారు. కరుణానిధి మరణంతో తమిళనాట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు సాయంత్రం 6.10 గంటలకు కరుణానిధి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. రెండు సంవత్సరాలుగా కరుణానిధి అనారోగ్యంతో ఇంటికే పరిమిత మయ్యారు. కరుణ మృతితో డీఎంకే అభిమానులు కావేరి ఆసుపత్రి ఎదుట రోదిస్తున్నారు.