బెంగుళూరులో ఏం జరుగుతోంది?

Update: 2018-05-19 03:24 GMT

బలపరీక్షకు సమయం దగ్గర పడుతుండటంతో కమలనాధులు వ్యూహప్రతివ్యూహాలకు సిద్దమయ్యారు. బెంగుళూరులోని తాజ్ వెస్టెండ్ హోటల్ లో అత్యవసరంగా కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు సీనియర్ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి జేపీ నడ్డా, మురళీధరరావు, యడ్యూరప్ప హాజరయ్యారు. బీజేపీ తాను బలపరీక్షలో నెగ్గుతామన్న విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

బెంగుళూరుకు చేరుకున్న.......

మరోవైపు నిన్న రాత్రి బయలుదేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగుళూరుకు చేరుకున్నారు. ప్రస్తుతం రిసార్ట్ లో బస చేసిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు 11 గంటలకు నేరుగా విధాన సభకు చేరుకోనున్నారు. తమకు 116 మంది సభ్యుల మద్దతు ఉందని కాంగ్రెస్, జేడీఎస్ లు ఇప్పటికే ప్రకటించాయి. తమ వర్గంలోని ఇద్దరిని బీజేపీ కిడ్నాప్ చేసిందని కూడా కాంగ్రెస్ ఆరోపించింది. ప్రొటెం స్పీకర్ నియామకం విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, జేడీఎస్ లు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి. మొత్తం మీద కర్ణాటక రాజకీయాలు గంట గంటకూ వేగంగా మారుతున్నాయి.

Similar News