ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరి నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఆయనపై జేడీఎస్ అభ్యర్థి దేవెగౌడ ముందంజలో ఉన్నారు. వరుణ నియోజకవర్గం నుంచి మారి సిద్ధరామయ్య చాముండేశ్వరిని ఎంచుకున్నారు. చాముండేశ్వరిలో జేడీఎస్ బలంగా ఉంది. ఇక్కడ ఒక్కలిగ కులస్థులు ఎక్కువగా ఉండటంతో ఆయన అనుమానంతో బాదామిలో కూడా పోటీ చేశారు. చాముండేశ్వరిలో వెనుకంజలో ఉన్నా బాదామిలో మాత్రం సిద్ధూ ముందంజలో ఉండటం కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరట కల్గించే అంశం.