బ్రేకింగ్: సిద్ధూ త్యాగం ఫలించేనా?

Update: 2018-05-15 03:47 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్యాగం ఫలించేటట్లుంది. ఆయన తన కుమారుడు యతీంద్ర కోసం తనకు పట్టున్న వరుణ నియోజకవర్గాన్ని త్యాగం చేశారు. అక్కడ కుమారుడు యతీంద్రకు అవకాశం కల్పించారు. తాను బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. బాదామిలో ముందంజలో ఉన్న సిద్ధరామయ్య చాముండేశ్వరిలో మాత్రం వెనుకంజలో ఉన్నారు. మరోవైపు వరుణ నియోజకవర్గంలో మాత్రం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ముందంజలో ఉండటం విశేషం. యతీంద్ర విజయం సాధిస్తే సిద్ధూ త్యాగం ఫలించినట్లేనని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News