బాదామి నియోజకవర్గంలో శ్రీరాములు వెనుకబడి ఉండటం ఆ పార్టీనేతలను ఆందోళనకు గురిచేస్తోంది. సీఎం సిద్ధరామయ్యను ఎలాగైనా ఓడించాలని బాదామిలో గాలి జనార్థన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములును రంగంలోకి దించారు. బీజేపీ అధికారంలోకి వస్తేవ శ్రీరాములును ఉప ముఖ్యమంత్రిగా కూడా చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో శ్రీరాములు వెనుకంజలో ఉన్నారు. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు శ్రీరాములు బాదామిలో తనదే విజయమని చెబుతున్నారు. గాలి జనార్థన్ రెడ్డికి, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. మొత్తం మీద శ్రీరాములు వెనకబడి ఉండటంతో ఆ పార్టీలో కొంత అయోమయం నెలకొంది.