కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ హంగ్ దిశగా కొనసాగుతున్నాయి. మొత్తం 216 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడుతుండగా బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం బీజేపీ 95, కాంగ్రెస్ 79, జేడీఎస్ 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు ఒకస్థానంలో ముందంజలో ఉన్నారు. ఇదే ట్రెండ్స్ కొనసాగితే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉన్నట్లు కన్పిస్తోంది.