జోడీ మరోసారి దుమ్ములేపింది

Update: 2018-05-15 04:46 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉంది. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మోడీ, షా జోడీ వ్యూహం మరోసారి సక్సెస్ అయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే 112 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 63 స్థానాల్లో మెజారిటీలో ఉంది. జేడీఎస్ అనూహ్యంగా 46 స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం మీద కర్ణాటక ఎన్నికల ఫలితాలు కమలం పార్టీకి ఆక్సిజన్ ను ఇచ్చాయనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలయిన బీజేపీకి కన్నడ ఎన్నికలు ప్రాణాన్ని తెచ్చి పెట్టాయి. ఈ ఫలితాల ప్రభావం వచ్చే లోక్ సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం పార్టీ వికసిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ భారత దేశంలో బీజేపీకి పట్టుందని నిరూపించుకుంది. టోటల్ గా మోడీ, షా జోడీ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.

Similar News