షా... జోస్యం ఫలిస్తుందా?

Update: 2018-05-15 04:23 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సెంచరీ కొట్టేసింది. వంద స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ 106 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 64 స్థానాల్లోనూ, జేడీఎస్ 46 స్థానాల్లోనూ, ఇతరులు ఒకస్థానంలోనూ ముందంజలో ఉన్నరు. మరోవైపు బీజేపీ తొలి విజయం సాధించింది. కోట్యాన్ లో బీజేపీ అభ్యర్థి ఉమానాధ్ విజయం సాధించారు.బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య దూరం పెరుగుతుండటంతో బీజేపీ స్పష్టమైన మెజారిటీ వచ్చే దిశగా ట్రెండ్స్ వెళుతున్నాయి. పోలింగ్ తర్వాత అమిత్ షా తమకు 130 సీట్లు వస్తాయని చెప్పారు. ట్రెండ్స్ చూస్తుంటే భారీ ఆధిక్యం దిశగా బీజేపీ వెళుతున్నట్లే కన్పిస్తోంది.

Similar News