కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగగా, తాజాగా కమలం పార్టీ అభ్యర్థులు కూడా దూసుకొస్తున్నారు. బలాబలాలు పోటాపోటీగా ఉన్నాయి. రెండు పార్టీలూ సమానంగానే ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ124 స్ధానాల ఫలితాల్లో తొలిరౌండ్ పూర్తవ్వగా అందులో బీజేపీ 49, కాంగ్రెస్ 61, జేడీఎస్ 16, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.