ఆంధ్రజ్యోతికి బీజేపీ నేత కన్నా ధన్యవాదాలు

‘అధికారం టీడీపీదే’ అంటూ ఏప్రిల్ 1న జోక్ ప్రచురించి మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతి పత్రికకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తెలుగు [more]

Update: 2019-04-01 13:01 GMT

‘అధికారం టీడీపీదే’ అంటూ ఏప్రిల్ 1న జోక్ ప్రచురించి మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతి పత్రికకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తెలుగు పత్రికలు ఏప్రిల్ 1న ఫూల్స్ డే నాడు హాస్యాస్పదంగా కథనాలు వేసేవారని, తర్వాత ఎందుకో మిగతా పత్రికలు ఆ సంప్రదాయాన్ని ఆపేశాయన్నారు. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ఈ వార్త ప్రచురించి నవ్వులు పూయించిందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇవాళ లోక్ నీతి – సీఎస్డీఎస్ సంస్థ సర్వే అని పేర్కొంటూ మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తోందని ఆంధ్రజ్యోతి ఓ సర్వేను మొదటి పేజీలో ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే, అసలు తాము ఏ సర్వే చేయలేదని, సదరు సర్వే తప్పని లోక్ నీతి – సీఎస్డీఎస్ సంస్థ ఖండించింది.

Tags:    

Similar News