సచివాలయం అద్భుతంగా ఉండాలి

తెలంగాణ సచివాలయ నిర్మాణం దేశానికే వన్నెతెచ్చే విధంగా, అలంకృత రూపంతో అద్భుతంగా వుండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. పదికాలాల పాటు నిలిచివుండే తెలంగాణ సెక్రటేరియట్ ను పటిష్టమైన [more]

Update: 2021-03-19 01:08 GMT

తెలంగాణ సచివాలయ నిర్మాణం దేశానికే వన్నెతెచ్చే విధంగా, అలంకృత రూపంతో అద్భుతంగా వుండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. పదికాలాల పాటు నిలిచివుండే తెలంగాణ సెక్రటేరియట్ ను పటిష్టమైన రీతిలో నిర్మించాలని కేసీఆర్ కోరారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ పనుల పురోగతిని సిఎం కేసీఆర్ పరిశీలించారు. సచివాయ నిర్మాణంలో, సుందరీకరణ కోసం, వినియోగించేందుకు రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ సాండ్ స్టోన్ , బీజ్ స్టాండ్ స్టోన్, నాచురల్ బీజ్, నాచురల్ గ్వాలియర్ స్టోన్స్ నమూనాలను సిఎం పరిశీలించారు. సచివాలయ నైరుతి దిక్కు ప్రాంతాన్ని కాలినడకన కలియతిరిగి, నిర్మాణంలో వున్న పిల్లర్లను, బీమ్ ల నాణ్యతను, పనితీరును పరిశీలించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు సహా వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు నిర్మాణాల్లో చేపట్ట వలసిన చర్యలకు సంబంధించి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రగతి భవన్ లో సెక్రటేరియట్ నిర్మాణంపై సమీక్షించారు.

Tags:    

Similar News