బక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంతమంది రావాలా?

హైదరాబాద్ లో వరదలు చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వరద సాయాన్ని ప్రకటించామని చెప్పారు. వరద బాధితులను ఆదుకోవాలని ప్రధాని [more]

Update: 2020-11-28 12:52 GMT

హైదరాబాద్ లో వరదలు చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వరద సాయాన్ని ప్రకటించామని చెప్పారు. వరద బాధితులను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరానని, కానీపైసా కూడా ఇవ్వలేదన్నారు. శాంతిభద్రతల విషయంలో ఆరేళ్లుగా ఎన్నడూ రాజీ పడలేదన్నారు. రౌడీ మూకలను అణిచివేశామని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను అధిగమించామని చెప్పారు. కులాలు, మతాలకు అతీతంగా అందరినీ ఆదుకునే ప్రయత్నం చేశామని చెప్పారు. ఓటు వేసే ముందు నగర ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలన్నారు. హైదరాబాద్ నిర్మాణ బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. డిసెంబరు 7వ తేదీ నుంచి వరద బాధితులకు పదివేల సాయాన్ని తిరిగి అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ లో రాబోయే రోజుల్లో 24 గంటలు నీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలను దేశానికే ఆదర్శమన్నారు. బక్క కేసీఆర్ ను కొట్టేందుకు ఇంతమంది రావాలా? అని కేసీఆర్ చమత్కరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి మాటలను నమ్మొద్దన్నారు.

Tags:    

Similar News