తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దేవుళ్లపై వున్న భక్తి శ్రద్ధలు దేశంలో ఏ నేతకు ఉండవేమో. అంతగా ఆయన ఆధ్యాత్మిక చింతనాపరుడు. తెలంగాణ కోసం ఆయన మొక్కిన మొక్కులు అన్ని ఇన్ని కావు. అన్ని కూడా ముఖ్యమంత్రి అయ్యాకా తీర్చుకుంటూ వచ్చారు కేసీఆర్. ఆయన ఏ దేవాలయం కి వెళ్ళినా ఆ దేవుడిపై సిరులు కురిపించేస్తూ వుంటారు. అది కూడా తన సొంత డబ్బేలెండి.
కాళేశ్వరం విజయవంతం కావాలని ...
కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వానికి ఒక సవాల్. ఈ ప్రాజెక్ట్ ను నిర్మించి తన సత్తా చాటి ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచన. అనుకున్న ముహూర్తానికి ఆయన కరీం నగర్ వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించేముందు దగ్గరలోని ముక్తేశ్వరం ఆలయంలోని అమ్మవారికి అత్యంత విలువైన చీరను బంగారు కీరిటం సమర్పించారు. ఆ చీరె ఇప్పుడు మాయం అయ్యిందన్న వార్త దావానలంలా వ్యాప్తి చెంది హల్చల్ చేస్తుంది.
ఎక్కడికి వెళ్లినట్లు....?
ఈ వ్యవహారంపై స్పందించాలిసిన ఆలయ అధికారులు కిమ్మనకుండా ఉండటంతో ఈ ప్రచారానికి మరింత ఊపు వచ్చింది. చివరికి ఒక ఐపీఎస్ అధికారి సైతం ఈ చీర మాయం కేసును తెరవెనుక నుంచే పరిశోధన మొదలెట్టారని అంటున్నారు. మరి ముఖ్యమంత్రి ఇచ్చిన చీర కదా అదే సెలబ్రిటీలు కానీ భక్తులు ఎంత విలువైన వస్తువులు సమర్పించినా అవి ఏమైయ్యాయి అని ప్రశ్నించినా స్పందించే దిక్కే ఉండదు. ఇంతకీ కేసీఆర్ అమ్మవారికి ఇచ్చిన ఒరిజినల్ చీర గుట్టు వీడుతుందో లేదో అని కరీం నగర్ వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.