కలసి పనిచేస్తాం… అధికారంలోకి వస్తాం

బీజేపీ, జనసేన కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 2024లో అధికారమే లక్ష్యంగా బీజేపీ, జనసేన కలసి పోటీచేస్తాయన్నారు. రాష్ట్ర [more]

Update: 2020-01-16 10:09 GMT

బీజేపీ, జనసేన కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 2024లో అధికారమే లక్ష్యంగా బీజేపీ, జనసేన కలసి పోటీచేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తామని చెప్పారు. రాష్ట్రాభివద్ధి జరగాలంటే బీజేపీ, జనసేన కలయికతోనే సాద్యమన్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని వెనక్కు నెట్టేశారని చెప్పారు. బీజేపీతో కలసి పనిచేయడానికి ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ ను అభినందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై రెండు పార్టీలూ చర్చించామన్నారు. కొత్త రాష్ట్రంలో అవినీతి రహిత పాలన జరగాలంటే బీజేపీతోనే సాధ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. సుస్థిర, అవినీతి రహిత పాలన అందించాలంటే బీజేపీ, జనసేనలతోనే సాధ్యమన్నారు. బీజేపీ, జనసేన భావాజాలం ఒక్కేనన్నారు పవన్. అందుకే బేషరతుగా బీజేపీతో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇంత పెద్ద రాజధాని అవసరం లేదని తాను ఆనాడే చెప్పానని పవన్ గుర్తు చేశారు.న ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, ఆ ప్రత్యమ్నాయమే జనసేన, బీజేపీ అని పవన్ కల్యాణ్ తెలిపారు.

టీడీపీతో ఎలాంటి పొత్తు…..

ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందన్నారు. ఏపీ రాజకీయాల్లో నేడు చారిత్రాత్మక నిర్ణయం జరిగిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. వైసీపీ, టీడీపీతో బీజేపీకి రాజకీయ సంబంధాలు లేవన్నారు. కేవలం జనసేన పార్టీతోనే సంబంధం ఉందన్నారు. ఇది కొత్త కూటమి అని జీవీఎల్ తెలిపారు. మకరసంక్రమణం జరిగినట్లుగానే ఇక ఏపీలో నేటి నుంచి వెలుగు ఎక్కువగా చీకటి తక్కువగా ఉందని బీజేపీ నేత సునీల్ దేవదర్ తెలిపారు. తెలుగుదేశం పార్టీతో ఎలాంటి పొత్తును కూడా ఏర్పరచుకోమని సునీల్ దేవధర్ తెలిపారు. అలాగే వైసీపీతో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. రాజధాని తరలింపు సాధ్యం కాదని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

Tags:    

Similar News