జోరు మీద వున్న జగన్

Update: 2018-07-18 03:42 GMT

వైసిపి చీఫ్ జగన్ తూర్పుగోదావరి జిల్లా టూర్ హుషారుగా సాగుతుంది. అనపర్తి నియోజకవర్గంలో ప్రజలు జగన్ కి జన నీరాజనమే పట్టారు. అదే ఊపులో ఆయన జిల్లాలో కీలకమైన కాకినాడ రూరల్ నియోజకవర్గంలోకి ఎంటర్ అయిపోయారు. కొవ్వాడ మీదుగా జగన్ కాకినాడ రూరల్ లోకి ప్రవేశించగానే అపూర్వ స్వాగతాన్ని అందుకున్నారు. 65 అడుగుల జగన్ వినూత్న కటౌట్ ను వైసిపి జిల్లా అధ్యక్షుడు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించి తమ అధినేతకు భారీ ఆహ్వానం పలికారు. జగన్ గుండెల్లోనుంచి జనం వెళ్ళేలా నిర్మించిన ఈ కటౌట్ అందరిని బాగా ఆకట్టుకుంది.

అదే జనం ....

ఒక పక్క వర్షాలు వస్తున్నా జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు జనాదరణ తగ్గడం లేదు. వేలాదిగా ప్రజలు తన వెంటరాగా వైసిపి అధినేత కాకినాడ రూరల్ ప్రాంతానికి చేరుకున్నారు. ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, మహిళలు జగన్ తో జతకట్టి నడిచి తమ సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను జగన్ ప్రశాంతంగా వినడంతో బాటు వైసిపి అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సరైన న్యాయం చేస్తానంటూ ముందుకు సాగిపోయారు. కాకినాడలో జగన్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు మరోవైపు సాగుతున్నాయి. జిల్లా కేంద్రం లో నిర్వహించబోయే ఈ సభకు పార్టీ శ్రేణులు ముఖ్యనేతలు తరలివెళుతున్నారు.

Similar News