వైసీపీ అధినేత జగన్ వద్దకు ప్రత్యేక దూతను పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రేపు అఖిలపక్ష సమావేశానికి వైసీపీని ఆహ్వానించేందుకు స్వయంగా ఒక మంత్రిని జగన్ పాదయాత్ర వద్దకు పంపాలని బాబు భావిస్తున్నారు. ఈరోజు ఆ మంత్రి వెళ్లి జగన్ ను స్వయంగా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించనున్నారు. శనివారం రెండో సారి అఖిలపక్ష సమావేశాన్ని చంద్రబాబు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి అందరూ హాజరుకావాలని చంద్రబాబు కోరుతున్నారు. గత సమావేశానికి జనసేన, వైసీపీ, బీజేపీ నేతలు హాజరు కాలేదు. జగన్ ప్రస్తుతం రాజధానికి సమీపంలోని గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారని, ఆయన అఖిలపక్ష సమావేశానికి రావాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో మరి.