హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

Update: 2022-07-29 12:25 GMT

హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకూ ఎండ కాచిన నగరంలో ఉన్నట్లుండి కుండపోత వర్షం మొదలయింది. మధ్యాహ్నం మూడు గంటలకే చీకట్లు అలుముకున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షం మొదలయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లిన వారు తిరిగి ఇళ్లకు చేరుకునే సమయంలో వర్షం కురియడంతో ఇబ్బందిగా మారింది. నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలు అనేక చోట్ల స్థంభించాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో వాహనాలు ముందుకు కదలడం లేదు. దీంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు.

జీహెచ్ఎంసీ అప్రమత్తం...
నేరేడ్‌మెట్ లో అత్యధికంగా 7.3 శాతం వర్షపాతం నమోదయిందని అధికారులు చెప్పారు. ఆల్వాల్ లో 4.8 శాతం, మల్కాజ్ గిరిలో 5.4 శాతం వర్షపాతం నమోదయింది. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమయింది. కంట్రోల్ రూమ్ లను ఏర్పాుటు చేసింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఏరోజు కారోజు గండంగడిస్తే చాలని నగర వాసులు బితుకుబితుకు మంటూ బతుకుతున్నారు.


Tags:    

Similar News