ఐపీఎల్ ను దెబ్బ కొట్టేశారు ...?

Update: 2018-05-19 02:30 GMT

ఈ సీజన్ లో దేశమంతా క్రికెట్ ఫీవర్ తో ఊగిపోవాలి. ఒక్కో జట్టు ప్లే ఆఫ్ కి చేరువ అవుతున్న తరుణంలో ఉత్కంఠ భరిత క్రికెట్ మ్యాచ్ లు సాగుతున్నాయి. ఎక్కడ చూసినా వారం క్రితం వరకు ఐపీఎల్.... ఐపీఎల్ అంటూ క్రీడాభిమానులు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతున్నారు. హాట్ సమ్మర్ ను క్రికెట్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కట్ చేస్తే గత వారం రోజులనుంచి సీన్ మారిపోయింది.

ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లు ఇప్పుడు ఇక్కడ ...

ఇప్పుడు అంతా ఐపీఎల్ మ్యాచ్ లు వదిలి కర్ణాటక రాజకీయాలపై దృష్టిపెట్టారు. క్షణక్షణానికి మలుపులు తిరుగుతున్న కన్నడ రాజకీయాలు దేశవాసులను తిరిగి న్యూస్ ఛానెల్స్ పత్రికలూ, వెబ్ పోర్టల్స్ వైపు దృష్టి పెట్టేలా చేశాయి. టి ట్వంటీ లలో లేని మజా కన్నడ పాలిటిక్స్ లో కనపడటమే ప్రేక్షకుల ట్రెండ్ మారిపోవడానికి కారణం అంటున్నారు విశ్లేషకులు. కర్ణాటక ఎన్నికల పోలింగ్ నుంచి కౌంటింగ్ ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటు అంశం ఆ వెంటనే కాంగ్రెస్ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించడంతో వేసవి తాపాన్ని మించి మరి కన్నడ రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతా ఇప్పుడు బుర్ర అటునుంచి ఇటు తిప్పారు. దాంతో టివి ఛానెల్స్ రేటింగ్ అమాంతం పెరిగితే ఐపీఎల్ రేటింగ్స్ కి దెబ్బ పడింది.

Similar News