దమ్మున్నోళ్లను సిద్ధం చేసిన కాంగ్రెస్ ...!

Update: 2018-05-26 02:30 GMT

రాబోయే ఎన్నికలకు సర్వసన్నద్ధం అవుతుంది టి కాంగ్రెస్. తమ ప్రధాన ప్రత్యర్థి కేసీఆర్ సర్కార్ ను ఎదుర్కోవడానికి జిల్లాలో సేనానులను సిద్ధం చేసి క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపింది. పలు వడపోతలు అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 13 మంది అధ్యక్షులను ఎంపిక చేసి ప్రకటించారు. వీరంతా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి నేతృత్వంలో రానున్న ఎన్నికలకు జిల్లాల్లో సారధ్యం వహిస్తారు. చాలా కాలంగా డిసిసి అధ్యక్షులుగా కొత్తవారి నియామకం వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఏడాదే ఎన్నికలకు సమయం ఉండటంతో రణక్షేత్రంలో కేడర్ ను సిద్ధం చేసే దమ్మున్నోళ్లు కావాలి. అందులోను ప్రత్యర్థి గులాబీ పార్టీ కావడంతో కాంగ్రెస్ అనేక అంశాలు పరిశీలించి నేతలను ఎంపిక చేసింది.

వీరే సారధులు ...

మెదక్ : సునీతా లక్ష్మా రెడ్డి,

వరంగల్ నాయిని రాజేంద్ర రెడ్డి

మహబూబ్ నగర్ : ఓబేదుల్లా కొత్వాల్

కరీంనగర్ : కటకం మృత్యుమ్ జయం

ఆదిలాబాద్ : మహేశ్వర రెడ్డి

నల్గొండ : భిక్షమయ్య గౌడ్

హైదరాబాద్ : అంజాన్ కుమార్ యాదవ్

నిజామాబాద్ : తాహెర్ బిన్ హమద్

రంగారెడ్డి : క్యామ మల్లేష్

నిజామాబాద్ సిటీ కేశ వేణు

కరీంనగర్ సిటీ : కర్ర రాజశేఖర్

వరంగల్ సిటీ : కేదాసి శ్రీనివాసరావు

రామగుండం సిటీ : లింగస్వామి యాదవ్

Similar News