ఆమెదే రికార్డ్

Update: 2018-07-20 06:30 GMT

భారత పార్లమెంట్ చరిత్రలో 27 వ అవిశ్వాస తీర్మానాన్ని మోడీ సర్కార్ ఎదుర్కోబోతుంది. ఇప్పటివరకు 66 ఏళ్ళ పార్లమెంట్ చరిత్రలో అత్యధిక అవిశ్వాసాలను ఎదుర్కొని నిలబడిన నేతగా ఇందిరా గాంధీ రికార్డ్ చెక్కు చెదరనిది గా వుంది. ఇక అవిశ్వాసాలను ఎదుర్కొని ప్రభుత్వాలు నిలబెట్టుకోలేని జాబితా ప్రధానుల్లో 1979 లో మొరార్జీ దేశాయి మొదటి వారు అయితే చివరి వ్యక్తి 1999 లో అటల్ బిహారి వాజపేయి సారధ్యంలోని ఎన్డీయే సర్కార్. వాజపేయి కాకుండా 1979 లోమొరార్జీ దేశాయి, 1990 లో విపి సింగ్ సర్కార్, 1997 లో దేవెగౌడ వున్నారు.

నెహ్రు ప్రభుత్వంపై తొలి అవిశ్వాసం ...

1963 లో కాంగ్రెస్ హయం లోని జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వంపై సోషలిస్టు నాయకుడు జెపి కృపాలాని అవిశ్వాసం ప్రతిపాదించారు. కానీ నెహ్రు కు పూర్తి మెజారిటీ ఉండటంతో తీర్మానం వీగిపోయింది. ఆ తరువాత లాల్ బహుదూర్ శాస్త్రి ప్రభుత్వంపై 1964, 1965,1966 లో వరుసగా విపక్షాలు ప్రవేశ పెట్టాయి. కానీ కాంగ్రెస్ కి పూర్తి మెజారిటీ కారణంతో అవి చర్చలకు మాత్రమే పరిమితం అయిపోయాయి. ఆ తరువాత ఇందిరాగాంధీ ప్రభుత్వంపై విపక్షాలు తీసుకువచ్చినన్ని అవిశ్వాస తీర్మానాలను ఏ ప్రభుత్వానికి ఎదురుకాలేదు. కానీ ఇందిర సంపూర్ణ మెజారిటీ తో సర్కార్ ను నడిపించడంతో వీటివల్ల ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. ఆ తరువాత రాజీవ్ గాంధీ ప్రభుత్వంపై టిడిపి తీసుకువచ్చిన అవిశ్వాసం మూజువాణి ఓటు తో వీగిపోయింది. ఇక ఐదేళ్లు సుస్థిర ప్రభుత్వం అందించిన పివి నరసింహారావు పై మూడు సార్లు విపక్షాలు అవిశ్వాసాలు తీసుకువచ్చాయి. బాబ్రీ విధ్వంసం తరువాత పివి అవిశ్వాసం ఎదుర్కొవాలిసి వచ్చినా తన చాణక్య నీతితో బయట పడగలిగారు. 2003 లో వాజ్ పేయి ప్రభుత్వం పై కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసం తరువాత మరో అవిశ్వాసానికి 15 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు పార్లమెంట్లో పూర్తి మెజారిటీతో వున్న మోడీ సర్కార్ 27 వ అవిశ్వాసాన్ని ఎదుర్కోవడం మరో చారిత్రక రికార్డ్ గా నమోదు కాబోతుంది.

Similar News