వామ్మో కల్కీ.. ఇంత డబ్బా?
కల్కి ఆశ్రమంలో నోట్లకట్టలు…. గుట్టలు గుట్టలుగా నోట్లకట్టలు.. విదేశీ నోట్లతో పాటుగా స్వదేశీ నోట్లకట్టలు చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఐదు రోజుల నుంచి [more]
కల్కి ఆశ్రమంలో నోట్లకట్టలు…. గుట్టలు గుట్టలుగా నోట్లకట్టలు.. విదేశీ నోట్లతో పాటుగా స్వదేశీ నోట్లకట్టలు చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఐదు రోజుల నుంచి [more]
కల్కి ఆశ్రమంలో నోట్లకట్టలు…. గుట్టలు గుట్టలుగా నోట్లకట్టలు.. విదేశీ నోట్లతో పాటుగా స్వదేశీ నోట్లకట్టలు చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఐదు రోజుల నుంచి చెన్నై తో పాటుగా హైదరాబాద్, తిరుపతి లో ఇన్ కమ్ టాక్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కల్కి ఆశ్రమ కేంద్రంగా జరుగుతున్న సోదాలు మొత్తం 20 ప్రాంతంలో జరుగుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రధానంగా తిరుపతి సమీపంలో ఉన్న కల్కి ఆశ్రమంలో ఐదు రోజుల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలుతో పాటు పెద్ద ఎత్తున పన్ను ఎగవేశారన్న ఆరోపణలు రావడంతో దాడులు జరుగుతున్నాయి.
నోట్ల కట్టలు…..
చెన్నైకి చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు . కల్కి ఆశ్రమంలో లో లెక్కకు మించిన ఆస్తులను అధికారులు గుర్తించారు. మూడు రోజుల క్రితం కల్కి ఆశ్రమంలో మంచి 500 కోట్ల పైచిలుకు అక్రమ ఆస్తులను గుర్తించినట్లు ఐటి అధికారులు పేర్కొన్నారు. ఈ ఆస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు . తాజాగా విడుదల చేసిన మరికొన్ని వివరాలను ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటివరకు కల్కి ఆశ్రమంలో 104 కోట్ల రూపాయల నగదును అధికారులు పట్టుకున్నారు . ఇందులో విదేశీ స్వదేశీ నొట్ల కట్టలు ఒక దగ్గర చేర్చి దానికి సంబంధించిన వీడియోని అధికారులు విడుదల చేశారు. అమెరికన్ డాలర్ల తో పాటు యూరోలు పెద్ద ఎత్తున అధికారులు కనుక్కున్నారు. దీంతో పాటుగా లండన్ చెందిన పౌండ్ లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు . మరోవైపు 2000, 500 నోట్ల కట్టలు కూడా అధికారులు పట్టుకున్నారు . అయితే వీటికి సంబంధించిన లెక్కలు ఇప్పటివరకు కూడా కల్కి ఆశ్రమ ప్రతినిధి చెప్పలేదని ఐటీ అధికారులు వెల్లడించారు . ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని ,వీటిలో ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు