హైదరాబాద్ లో ఐటీ దాడులు… 700 కోట్ల నల్లధనం?

హైదరాబాద్ నగరంలో మరొకసారి భారీగా నల్లధనాన్ని ఇన్ కమ్ టాక్స్ అధికారులు గుర్తించారు. ఇటీవల పెరిగిన రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారం పైన ఆదాయపు పన్ను శాఖ [more]

Update: 2021-04-01 02:15 GMT

హైదరాబాద్ నగరంలో మరొకసారి భారీగా నల్లధనాన్ని ఇన్ కమ్ టాక్స్ అధికారులు గుర్తించారు. ఇటీవల పెరిగిన రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారం పైన ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్న రెండు కంపెనీ లో ఐటీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో దాదాపు 700 కోట్ల రూపాయల పై చిలుకు నల్లధనం లావాదేవీలు జరిగినట్లు అధికారులు తేల్చారు. దాదాపు 700 కోట్ల రూపాయల నల్లధనాన్ని అధికారులు ఉన్నట్లుగా తేల్చారు. రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లో సోదాలు జరిగినప్పుడు నల్లధనం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. గత ఆరు సంవత్సరాల కాలం నుంచి ఏడు వందల కోట్ల రూపాయల పై చిలుకు నల్లధనాన్ని లావాదేవీలు జరిపారని అధికారుల విచారణలో బయట పడింది. అయితే 12 కోట్ల రూపాయల నల్లధనాన్ని అధికారులు సీజ్ చేశారు. దీంతో పాటుగా రెండు కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News