హైపర్ ఆదికి జనసేన టిక్కెట్ కన్ఫర్మ్.. ఎక్కడి నుంచి అంటే?

జబర్దస్త్ లో కెమిడియన్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది త్వరలోనే రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టబోతున్నట్లు తెలిసింది

Update: 2023-01-13 08:04 GMT

జబర్దస్త్ లో కెమిడియన్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది త్వరలోనే రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టబోతున్నట్లు తెలిసింది. జనసేన అభ్యర్థిగా ఆయన వచ్చే ఎన్నికలలో పోట ీచేస్తారన్న ప్రచారం పార్టీలో ఊపందుకుంది. తన పంచ్ లతో ఆది ప్రేక్షకులను కడుపుబ్బ నవిస్తాడు. ఆయన స్కిట్ లు చూసిన వారెవరైనా ఇట్టే ఫిదా కావాల్సిందే. పంచ్ లకు హైపర్ ఆది ఫేమస్. బుల్లితెరపై అతి తక్కువ కాలంలో ఫేమస్ అయిన ఆదీ అనతి కాలంలోనే పేరు సంపాదించుకున్నాడు. చిన్నా చితకా సినిమాల్లో నటించినా అంత పెద్ద రోల్స్ రాకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది.

చీమకుర్తి దగ్గర...
హైపర్ ఆదిది ప్రకాశం జిల్లా చీమకుర్తి దగ్గర ఒక గ్రామం. ఆయన బీటెక్ చదివి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. టీసీఎస్ లో కొంతకాలం పనిచేసిన ఆది ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యాడు. ఇక ఆది వెనక్కు తిరిగి చూసుకోలేదు. జబర్దస్త్ అంటేనే హైపర్ ఆదిలా మారిపోయింది. అయితే ఇటీవల ఆ షో మానేసి వేరే షోలు చేసుకుంటున్నాడు. అయినప్పటికీ ఆదికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి ఆది మెగా కుటుంబానికి మెగా ఫ్యాన్. అందులోనూ పవన్ కల్యాణ్ అంటే హైపర్ ఆదికి అత్యంత ఇష్టం.

ఈ రెండుచోట్ల నుంచి...
హైపర్ ఆది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడు. ఒంగోలు ప్రాంతంలో కొంత పరిచయాలున్నాయి. జబర్దస్త్‌తో ఫేమస్ కావడంతో ఆయన ఒంగోలు లేదా దర్శి నుంచి జనసేన తరుపున పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇందుకు పవన్ కల్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కామిడీ షోలో అతి తక్కువ కాలంలోనే రాణించినట్లుగానే పాలిటిక్స్ లోనూ ఒకే టైంలో అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని హైపర్ ఆది భావిస్తున్నారు. ఒంగోలు, దర్శిలో పవన్ అభిమానులతో పాటు కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి పోటీ చేయాలని రెడీ అవుతున్నారని తెలిసింది.
నిన్నటి సభలోనూ...
నిన్న రణస్థలంలో జరిగిన సభలోనూ హైపర్ ఆది స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. తాను జనసైనికుడిగా ఇక్కడకు వచ్చానని, ఒక జనసేన అభ్యర్థిగా మాట్లాడుతున్నానని చెప్పడం కూడా అందుకేనని అంటున్నారు. సభలో కూడా ఆది పంచ్ లు నవ్వులు పూయించాయి. వారాహి వాహనాన్ని ఆపేస్తే పవన్ కల్యాణ్ తిక్కలేచి పాదయాత్ర చేస్తాడని, అప్పుడు మంత్రులకు కాశీయాత్ర గతేనంటూ ఆయన పంచ్ విసిరాడు. అలాగే ఆయన పవన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించినప్పుడు సభకు వచ్చిన అభిమానుల నుంచి చప్పట్లే స్వాగతం పలికాయి. ఇలా హైపర్ ఆది ఎమ్మెల్యే ఆదిగా మారాలనుకుంటున్నాడు. మరి ఆయన పాలిటిక్స్ ఏ రీతిగా సాగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News