బ్రేకింగ్‌: హైదరాబాద్‌ వాసులకు రెడ్‌ అలర్ట్‌

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన కారణంగా ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటలుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో రోడ్లన్ని జలమయమయ్యాయి. ఎటు చూసినా చెరువుల్లా తలనిస్తున్నాయి.

Update: 2023-09-05 02:08 GMT

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన కారణంగా ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటలుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో రోడ్లన్ని జలమయమయ్యాయి. ఎటు చూసినా చెరువుల్లా తలనిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్‌లు జారీ చేసింది. దాదాపు 9 జిల్లాలకు ఆరెంజ్‌, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇక ఏపీకి భారీ వర్ష సూచనను జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్‌ నగర వాసులకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అయితే ముందుగా ఎల్లో అలర్ట్‌ ప్రకటించిన అధికారులు.. భారీ వర్షాల కారణంగా రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. సుమారు ఆరు గంటలకుపైగా భారీ వర్ష సూచన ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది, రెస్క్యూ టీమ్‌ సహాయ చర్యలకు రెడీగా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

హైదరాబాద్‌ నగరరంలో చాలా ప్రాంతాల్లో గుంతలు ఉండటంతో నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మ్యాన్‌ హోల్స్‌ అన్ని కూడా భారీ వర్షానికి తెరుచుకుని ఉండే అవకాశాలున్నందున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరరం ఉంది. నగరంలో భారీ వర్షాల కారణంగా లొతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఉదయం నుంచి కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షం కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు విరిగి పడ్డాయి. కాలనీలన్ని చెరువుల్లా తలపిస్తున్నాయి.

తెలిసిన నడక మార్గాల్లోనే వెళ్లండి

కాగా, హైదరాబాద్‌ నగరంలో మరో మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా నగరంలో మ్యాన్‌ హోల్స్‌ తరుచుకోవడం, పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఉండటం కారణంగా ప్రజలు తెలిసిన నడక ప్రాంతాల్లోనే వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్త మార్గాల్లో వెళితే ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నారు. బంజారాహిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌ పల్లి, యూసుఫ్‌ గూడ, జూబ్లి హిల్స్‌,మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, హిమాయత్‌ నగర్‌, బోరబండ తదితర ప్రాంతాలలో భారీ వర్షాపాతం నమోదైంది.

Tags:    

Similar News