ఏదైనా ప్రకృతి వైపరీత్యం ఎదురైనా ప్రమాదం సంభవించినా జాతీయ విపత్తు నివారణ బృందాల కోసం ఎదురు చూసే పని ఇకపై భాగ్యనగర్ వాసులకు లేదు. తెలంగాణ సర్కార్ విపత్తు నివారణ బృందాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ వాసులకు భరోసా ఇచ్చింది. 120 మంది తో కూడిన ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం శిక్షణ పూర్తి చేసుకుని విధులకు సిద్ధమైంది. వరదలు, తుఫాన్ లు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, ఇలా ఏది ఎదురైనా తక్షణం రంగంలోకి దిగిపోతుంది ఈ టీం. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఎలాంటి శిక్షణ పొందుతాయో ఆ స్థాయిలోనే వీరికి ప్రత్యేక తర్ఫీదును అందించారు.
నానక్ గూడా రామ్ సంఘటనతో ...
హైదరాబాద్ నానక్ రామ్ గుడా లో జరిగిన సంఘటనతో డిజాస్టర్ మేనెజ్గ్మెంట్ టీం ను ఏర్పాటు చేయాలిసిన అవసరాన్ని గుర్తు చేసింది. శిక్షణ కార్యక్రమం ముగింపులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ అంశాన్ని ధృవీకరించారు.. విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ కి అన్ని రకాల రక్షణలు స్వీయ నియంత్రణ సంస్థల ఆవశ్యకత ఉందన్నారు కేటీఆర్. ఈ బృందాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 120 మంది సభ్యులతో కూడిన ఈ బృందం ఐపీఎస్ విశ్వజిత్ నేతృత్వంలో శిక్షణ పొందింది.