ఫిరాయించిన ఎమ్మెల్యేలే పిటీషన్ వేస్తేఎలా?

Update: 2018-04-27 10:16 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాల రద్దుకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో వేసిన అప్పీల్ పిటిషన్ పై విచారణ జరిగింది. పిటీషనర్ల తరపున ఢిల్లీ నుంచి వచ్చిన వైద్యనాధన్ వాదనలు వన్పించారు. 12 మంది ఎమ్మెల్యేలు సభలో సభ్యులే కాబట్టి ప్రతి సభ్యునికి పిటిషన్ వేసే అర్హత ఉందన్నారు.కోమటిరెడ్డి,సంపత్ ల వ్యవహారం లో మీడియా లో ప్రసారమైన నాలుగు వీడియో లను కోర్టుకు సమర్పించారు.సభ్యత్వం రద్దుకు ముందు సభ్యుల వివరణ కోరి ఉండాల్సిందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది .సభ్యులు ఇచ్చే వివరణ చూసి ఉంటే మీరు సభ్యత్వం రద్దు చేయకుండా ఉండే వారేమో అని వ్యాఖ్యానించింది హైకోర్టు. పిటిషన్ వేసే అర్హత ఎమ్మెల్యే లకు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ల న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదించారు.పిటిషన్ వేసిన వాళ్లలో ఎక్కువ మంది పార్టీ ఫిరాయింపు దారులే అని ఆయన చెప్పారు. వీరి సభ్యత్వ కొనసాగింపే ఇంకా స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉందన్నారు జంధ్యాల.వీళ్ళు సభా హక్కులు,నిబంధనలు,విలువలపై స్పందించడం బాధాకరం అని వాదనలు వినిపించారు.తదుపరి విచారణను సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

Similar News