నేడు జగన్ తో భేటీ

అమరావతి రాజధాని అంశంపై నియమించిన హై పవర్ కమిటి నేడు ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కానుంది. ఇప్పటికే మూడుసార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ వివిధ [more]

Update: 2020-01-17 02:08 GMT

అమరావతి రాజధాని అంశంపై నియమించిన హై పవర్ కమిటి నేడు ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కానుంది. ఇప్పటికే మూడుసార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ వివిధ అంశాలపై చర్చించింది. మూడు రాజధానులు, రాజధాని రైతుల సమస్యలు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన రాయితీల వంటి వాటిపై ఇప్పటికే చర్చించింది. ఈరోజు సమావేశమయ్యే హై పవర్ కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి జగన్ కు సమర్పించే అవకాశముంది. జగన్ తో చర్చించిన తర్వాత నివేదికల మార్పులు, చేర్పులు చేయవచ్చని తెలుస్తోంది. కాగా ఈ నెల 20వతేదీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో హై పవర్ కమిటీ చివరి సమావేశం ఇదే కానుంది. ఇప్పటికే సీఆర్డీఏకు చేరిన రాజధాని రైతుల అభ్యంతరాలను కూడా కమిటీ పరిశీలించనుంది.

Tags:    

Similar News