ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

వక్ఫ్ బోర్డు స్థలాల ఆక్రమణలపై హైకోర్టు లో విచారణ జరిగింది. 2,186 ఆస్తులు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామని ప్రభుత్వం పేర్కొంది. అయితే అందులో ఎన్ని స్వాధీనం చేసుకున్నారో [more]

Update: 2021-03-26 01:24 GMT

వక్ఫ్ బోర్డు స్థలాల ఆక్రమణలపై హైకోర్టు లో విచారణ జరిగింది. 2,186 ఆస్తులు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామని ప్రభుత్వం పేర్కొంది. అయితే అందులో ఎన్ని స్వాధీనం చేసుకున్నారో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఆస్తుల స్వాధీనం వివరాలు లేకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ టాస్క్ ఫోర్స్ లో ఎంతమంది ఉన్నారు..? ఎన్ని ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు..? జిల్లాల వారీగా వివరాలు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 10కి వాయిదా వేసింది.

Tags:    

Similar News