అంబటి అక్రమ మైనింగ్ పై హైకోర్టులో?

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సహకారంతో సత్తెనపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై దాఖలైన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే దీనిపై ఇప్పటికే కమిటీ [more]

Update: 2021-03-31 01:01 GMT

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సహకారంతో సత్తెనపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై దాఖలైన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే దీనిపై ఇప్పటికే కమిటీ వేశామని, అక్రమ మైనింగ్ జరిగినట్లు గుర్తించామని ప్రభుత్వ తరుపున న్యాయవాది పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టామని పేర్కొంది. అయితే వారు ఎవరెవరని ప్రశ్నించారని కోర్టు ప్రశ్నించింది. పిటీషన్ వేసిన వారిపైనే అక్రమ కేసులు పెట్టారని పిటీషనర్ తరుపున న్యాయవాది పేర్కొన్నారు. ఈ విచారణను వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News