ఆ అధికారం కాంగ్రెస్ నేతలకు లేదు

సచివాలయం కూల్చివేత లను పరిశీలించేందుకు అనుమతించాలని కాంగ్రెస్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి పరిశీలించే అధికారం లేదని తెలిపింది. ప్రజాప్రతినిధులు [more]

Update: 2020-08-10 08:17 GMT

సచివాలయం కూల్చివేత లను పరిశీలించేందుకు అనుమతించాలని కాంగ్రెస్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి పరిశీలించే అధికారం లేదని తెలిపింది. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే విచారణ కోరే హక్కు ఉంటుంది, ఫీల్డ్ లోకి వెళ్లి విచారణ జరిపే అధికారం లేదంటూ హైకోర్టు స్పష్టం చేసింది . ఈ మేరకు ఈ కేసు ఈ రెండు వారాల పాటు వాయిదా వేసింది. సచివాలయం కూల్చివేతల పరిశీలనకు అనుమతించాలన్న దానిపై కాంగ్రెస్ నేతల హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిల్ పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది.
తమ దరఖాస్తులపై డీజీపీ, సీపీ స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే కాంగ్రెస్ నేతల దరఖాస్తులపై ఏం చేశారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏజీ క్వారంటైన్ లో ఉన్నందున రెండు వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు.పురాతన ఆలయం, మసీదు పొరపాటున కూలి పోయాయని ప్రభుత్వం చెబుతోందని కాంగ్రెస్ నేతల న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. పొరపాటున జరిగిందా? లేక ఉద్దేశ పూర్వకంగా కూల్చారా పరిశీలించమని కాంగ్రెస్ నేతలు కోర్టు ను కోరారు.దర్యాప్తు చేసే అధికారం ప్రజా ప్రతినిధులకు లేదని హైకోర్టు తెలిపింది.

Tags:    

Similar News