పరారీలో లేనంటున్న శివాజీ

రవిప్రకాష్, తనకు మధ్య జరిగిన సివిల్ వివాదంలో తనను ఎలా అరెస్ట్ చేస్తారని సినీ నటుడు, గరుడ ఫేమ్ శివాజీ ప్రశ్నించారు. టీవీ9 యాజమాన్య వివాదంలో నమోదైన [more]

Update: 2019-05-18 10:22 GMT

రవిప్రకాష్, తనకు మధ్య జరిగిన సివిల్ వివాదంలో తనను ఎలా అరెస్ట్ చేస్తారని సినీ నటుడు, గరుడ ఫేమ్ శివాజీ ప్రశ్నించారు. టీవీ9 యాజమాన్య వివాదంలో నమోదైన కేసుల్లో విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న శివాజీ ఇవాళ ఓ వీడియోను విడుదల చేశారు. ఎక్కడ ఉన్నారో, ఎక్కడి నుంచి పంపించారో చెప్పకుండా వీడియో విడుదల చేశారు. తమ మధ్య వివాదం కోర్టులో ఉందని, అయినా సివిల్ పంచాయితీని క్రిమినల్ పంచాయితీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 2018 ఫిబ్రవరిలో తమ మధ్య ఒప్పందం జరిగిందని, ఆ అగ్రిమెంట్ ను ఇటీవల రీరైట్ చేసుకున్నానని చెప్పారు. తాను సెటిలర్ ని కాబట్టి, స్థానబలం లేదు కాబట్టి హైదరాబాద్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

వడదెబ్బ తాకింది… పారిపోలేదు…

తనకు వడదెబ్బ తగిలి రెస్ట్ తీసుకుంటున్నానని, తానేమీ పారిపోనని అన్నారు. తనను టార్గెట్ చేసి తొక్కేయాలని చూస్తున్నారని వాపోయారు. నెహ్రూ తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిపారని, జై ఆంధ్ర ఉద్యమంలో అనేకమంది జైళ్లలో ఉన్నారని వారితో పోల్చుకున్నారు. తాను వెనక్కుపోయే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ట్విట్టర్, టీవీల వేదికగా శునకానందం పొందుతున్న వారు తనపై రాళ్లు వేస్తున్నారని, అవే రాళ్లు వాళ్లకు కూడా తగులుతాయన్నారు. కొంతమంది ఆంధ్రా నాయకులు.. తెలంగాణ నాయకులతో కలిసి తనను లోపలేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖర్మ బాగోలేక వేరే ప్రభుత్వం(వైసీపీ) వచ్చినా తాను పోరాడతానన్నారు.

Tags:    

Similar News