తను లేకుండా బతకలేను: సూసైడ్ నోట్‌లో గీతిక

Update: 2018-08-13 10:16 GMT

సంచలనం సృష్టిస్తున్న తిరుపతి శ్రీవెంకటేశ్వర మెడికల్ కాలేజ్ వైద్యవిద్యార్థిని గీతిక ఆత్మహత్య కేసులో సూసైడ్‌ నోట్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే గీతిక ఆత్మహత్యకు కారణమని సూసైడ్‌ నోట్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గీతిక రాసిన సూసైడ్ నోట్‌లో ఉన్నది ఇదే...‘‘అమ్మా, నా జీవితం ఇలా అయిపోతుందని ఊహించలేదు. ఎందుకో అమ్మా ఇక నాకు బతకాలని లేదు. నాకు ఈ పరిస్థితి వస్తుందని ఊహించుకోలేదమ్మా. అందరి గురించి ఆలోచించి, అందరు అమ్మాయిల్లాగా నాకూ భర్త, కుటుంబం.. అతని ప్రేమ కావాలనుకున్నా. కానీ, నా జీవితంలో నేను ఓడిపోయానమ్మా. తను లేకుండా నేను బతకలేను. కనీసం నా జీవితం కోసమైనా తనను ఏమీ చేయకమ్మా. నన్ను క్షమించు అమ్మా. నేను పిరికిదాన్ని కాదమ్మా. కానీ, నాకు వేరే దారి కనిపించలేదు. తను లేకుండా బతకలేను. అలా అని తనతో కలిసి బతకలేను. అందుకని వెళ్లిపోతున్నాను.నన్ను క్షమించండి’’ అని రాసింది. సుసైడ్ నోట్ ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News