జంట మధ్య చిచ్చుపెట్టిన మ్యాగీ.. ఇద్దరి అంగీకారంతో విడాకులు !

జస్టిస్ రఘునాథ్ మాట్లాడుతూ, "వైవాహిక సమస్యలను పరిష్కరించడం కష్టం. దంపతులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే..

Update: 2022-05-30 11:36 GMT

మైసూరు డిస్ట్రిక్ట్ సెషన్స్ అండ్ ప్రిన్సిపల్ జడ్జ్ ఎం.రఘునాథ్ సోమవారం నాడు మాట్లాడుతూ.. ఆయన విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ జంట మ్యాగీ కారణంగా విడిపోవాలని నిర్ణయించుకుందని చెప్పుకొచ్చారు. బళ్లారి జిల్లాలో తాను న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జరిగిన విడాకుల కేసును రఘునాథ్ గుర్తు చేసుకున్నారు. లోక్‌ అదాలత్‌ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లోని బిజీ లైఫ్‌ అనేక విడాకుల కేసులకు దారితీస్తోందని అభిప్రాయపడ్డారు. తాను బళ్లారిలో జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు ఓ జంట విడాకుల కోసం పిటిషన్ వేశారని చెప్పారు.

తన భార్య తనకు రోజూ మూడుసార్లు 'మ్యాగీ' ని వండుతోందని భర్త తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇంటి దగ్గర దుకాణాలు ఉన్నప్పటికీ ఆమె కిరాణా కొనడం మానేసిందని.. భర్త రోజూ మ్యాగీ తింటూ అస్వస్థతకు గురయ్యానని కోర్టులో చెప్పుకొచ్చాడు. పరస్పర అంగీకారంతో ఇద్దరికీ విడాకులు ఇచ్చామని న్యాయమూర్తి తెలిపారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. కుటుంబ వివాదాలు పంచాయతీల ద్వారా పరిష్కరించబడతాయన్నారు. మహిళలు గౌరవ భావంతో విడాకులు తీసుకోవడానికి భయపడుతున్నారన్నారు. కానీ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్థిరంగా ఉండడంతో విడాకుల కోసం దాఖలు చేయడానికి వెనుకాడరని ఆయన వివరించారు.
జస్టిస్ రఘునాథ్ మాట్లాడుతూ, "వైవాహిక సమస్యలను పరిష్కరించడం కష్టం. దంపతులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే, తిరిగి కలుసుకోవడం సాధ్యమవుతుంది. చాలా సమయం భావోద్వేగాలకు గురవ్వడంతో వివాహాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. చాలా వరకూ సదరు జంట కలిసి జీవించాలని నిర్ణయించుకున్నా, మానసికంగా కొన్ని సంఘటనలు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి" అని అన్నారు. ఇటీవలి కాలంలో విడాకులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే ముందు దంపతులు కనీసం ఒక సంవత్సరం పాటు కలిసి జీవించాలనే చట్టం ఉంది. లేకుంటే చాలా మంది జంటలు నేరుగా కళ్యాణ మండపం నుంచే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించేవారు. పెళ్లయిన మరుసటి రోజే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. చాలా చిన్న చిన్న కారణాలతో జంటలు విడాకులు కోరుతున్నారు. ప్రేమ వివాహం, పెద్దలు కుదిర్చిన వివాహాలు రెండింటిలోనూ మేము విడాకుల కేసులను సమానంగా చూస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News