తెలంగాణ కాంగ్రెస్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు పంపారు. రేపు దానం నాగేందర్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. దానం టీఆర్ఎస్ లోకి చేరేందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని తెలుస్తోంది.