నకిలీ జీవో తయారు చేసి…?

ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఏకంగా ప్రభుత్వ జీవో ని సృష్టించాడు.. ఉన్నత చదువులు… చదువుకున్నా డు.. అంతేకాకుండా చార్టెడ్ అకౌంటెంట్ గా స్థిరపడ్డారు.. నెల్లూరు నుంచి హైదరాబాద్ [more]

Update: 2021-04-06 01:27 GMT

ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఏకంగా ప్రభుత్వ జీవో ని సృష్టించాడు.. ఉన్నత చదువులు… చదువుకున్నా డు.. అంతేకాకుండా చార్టెడ్ అకౌంటెంట్ గా స్థిరపడ్డారు.. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వచ్చి ప్రముఖ కార్పొరేట్ సంస్థలో చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. ప్రజలందరినీ కూడా లాక్ డౌన్ పేరుతో పిచ్చి వాళ్లని చేయాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ పేరుతో ఒక నకిలీ జీ ఓ సృష్టించాడు.. ఈనెల 2వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నాడు. నకిలీ జీ వో తయారు చేసి నేరుగా సోషల్ మీడియాలో వదిలి పెట్టాడు.. ఈ జీ ఓ ను చూసి ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఈ జీవో పైన ప్రభుత్వం చివరికి వివరణ కూడా ఇవ్వవలసి వచ్చింది. అయితే నకిలీ జీఓ కేసు ను సవాలుగా తీసుకున్న పోలీసులు అధికారులు వెంటనే కేసు నమోదు చేశారు. నకిలీ జీఓ ను తయారు చేసిన సంజయ్ కుమార్ ని అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు.

Tags:    

Similar News