రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్… సస్పెన్షన్లు ఎత్తివేయాలంటూ

రాజ్యసభ సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించింది. ఎనిమిది మంది సభ్యులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సభ్యులపై సస్పెన్షన్ ను తొలగించేంతవరకూ సమావేశాలకు హాజరుకాబోమని [more]

Update: 2020-09-22 05:47 GMT

రాజ్యసభ సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించింది. ఎనిమిది మంది సభ్యులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సభ్యులపై సస్పెన్షన్ ను తొలగించేంతవరకూ సమావేశాలకు హాజరుకాబోమని కాంగ్రెస్ ప్రకటించింది. వ్యవసాయ బిల్లులపై కూడా పునరాలోచించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రతిపక్షాల డిమాండ్ ను ఛైర్మన్ వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. తనకు ఏ సభ్యుడిపైనా ప్రత్యేకంగా వ్యతిరేకత ఉండదని స్పష్టం చేశారు. సభ్యుల సస్పెన్షన్ పై తాను సంతోషంగా లేనని వెంకయ్యనాయుడు చెప్పారు. అయితే తనపై విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరుకు నిరసనగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టారు.

Tags:    

Similar News