అమరావతి ల్యాండ్ స్కామ్.. ఆయన కోసం వెతుకులాట

అమరావతి రాజధాని భూ కుంభకోణంలో రియల్టర్ బ్రహ్మానందరెడ్డి కోసం సీఐడీ అధికారులు వెతుకుతున్నారు. ఆయన రెండు రోజులుగా కన్పించడం లేదు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన [more]

Update: 2021-07-06 06:08 GMT

అమరావతి రాజధాని భూ కుంభకోణంలో రియల్టర్ బ్రహ్మానందరెడ్డి కోసం సీఐడీ అధికారులు వెతుకుతున్నారు. ఆయన రెండు రోజులుగా కన్పించడం లేదు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు, విడుదల చేసిన వీడియో ఫుటేజీ ఆధారంగా బ్రహ్మానందరెడ్డి పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. ప్రధానంగా అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో దళితుల నుంచి ఎక్కువ ఎకరాలను బ్రహ్మానందరెడ్డి తీసుకుని విక్రయించినట్లు తెలిసింది. ఆర్కే ఆరోపణల తర్వాత బ్రహ్మానందరెడ్డి కన్పించడం లేదు. ఆయనను అదుపులోకి తీసుకుంటే తప్ప పూర్తి వాస్తవాలు బయటకు రావు.

Tags:    

Similar News