కాంగ్రెస్ కి రివర్స్ అయిన ఆ... పార్టీ

Update: 2018-11-14 10:24 GMT

మహాకూటమి భాగమవుతుందనుకున్న తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ శత్రువుగా మారిపోయింది. తాము అడిగిన స్థానాలు కేటాయించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేస్తానని ప్రకటించారు. ఇంటి పార్టీని మొదటి నుంచి కూటమికి దూరం చేయాలని చూశారని ఆరోపించారు. మహాకూటమిలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఢిల్లీలో ఉద్యమకారులు సీట్ల కోసం పడిగాపులు కాస్తున్నారని వాపోయారు.

సామాజిక న్యాయం ఏదీ....?

కూటమి కేటాయించిన సీట్లలో సామాజిక న్యాయం లేదని, సీట్ల జాప్యానికి కోదండరాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణమని ఆరోపించారు. ఇంటి పార్టీకి నకిరేకల్, మునుగోడు స్థానాలు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ని కోరారు. అయితే, ఈ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ స్వంతంగా అభ్యర్థులను ప్రకటించేసింది.

Similar News