విశాఖలో గ్యాస్ లీక్.. అధికారులకు జగన్ ఆదేశం

విశాఖపట్నం నగరంలో ఒక పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్ అయింది. ఈ పరిశ్రమలో ప్రమాదం జరగడంతో గ్యాస్ లీకవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోపాలపట్నం పరిధిలోని [more]

Update: 2020-05-07 01:47 GMT

విశాఖపట్నం నగరంలో ఒక పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్ అయింది. ఈ పరిశ్రమలో ప్రమాదం జరగడంతో గ్యాస్ లీకవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్. వెంకటాపురం లోని ఎల్.జి. పాలిమర్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రసాయన వాయువు లీకై మూడు కిలో మీటర్ల వరకూ వ్యాపించింది. దీంతో అక్కడి ప్రజల చర్మంపై దద్దుర్లు, కళ్లమంటలు వచ్చాయి. శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. ఫ్యాక్టరీకి మూడు కిలోమీటర్ల పరిధిలో ఇళ్లను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే అంబులెన్స్ లతో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈసంఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. కలెక్టర్ తో మాట్లాడారు. వెంటనే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

Tags:    

Similar News