కష్టం వచ్చినప్పుడు నాకు కాపలాగా ఉండాలి..!

హైదరాబాద్ ను అభివృద్ధి చెసిన తనపైనే దాడులు చేసే పరిస్థితికి వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం మదనపల్లిలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఐటీ [more]

Update: 2019-03-04 09:40 GMT

హైదరాబాద్ ను అభివృద్ధి చెసిన తనపైనే దాడులు చేసే పరిస్థితికి వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం మదనపల్లిలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఐటీ గ్రిడ్ పై కేసు నమోదు వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డేటా కాపాడటానికి తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు. డేటా హైదరాబాద్ లో ఉంటే తన వద్దకు పంపించాలని, తాను చూసుకుంటానని, తన డేటాను తాను కాపాడుకోగలనని పేర్కొన్నారు. మా డేటా దొంగలిస్తే అరెస్టులు చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తమ పార్టీ డేటాను వైసీపీకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. టీడీపీని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే మూలాలు కదిలిస్తామని హెచ్చరించారు. ఇది ప్రజాస్వామ్యా.. నియంతృత్వమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఇలాంటి పనిచేయలేదన్నారు.

తాతకు దగ్గులు నేర్పిస్తారా..?

1984 నుంచి ఈ దేశంలో ఐటీకి మారు పేరు తానే అని చంద్రబాబు అన్నారు. ఇవాళ అందరూ వాడుతున్న సెల్ ఫోన్లకు కూడా తానే శ్రీకారం చుట్టానని, అటువంటిది డేటా గురించి నాకే చెబుతున్నారని అన్నారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటానని.. తమ జోలికి రావొద్దని, తాము అసలే కష్టాల్లో ఉన్నామని హెచ్చరించారు. జగన్ హైదరాబాద్ లో ఉండి ఏపీపై కుట్రలూ, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజల బాగు కోసమే తాను నరేంద్ర మోడీతో విభేదించానన్నారు. కేసీఆర్ కూడా ఇష్టానుసారంగా చేస్తుంటే.. ఆస్తులు పోయినా పర్వాలేదు కానీ పరువు కూడా పోయే పరిస్థితి వచ్చిందని తిరుగుబాటు చేశానని పేర్కొన్నారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాను కాపాడుతానని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్ ముసుగు తీసేసి రావాలని సవాల్ చేశారు. ఐటీ దాడులు చేయిస్తే తాను భయపడనని అన్నారు. అన్నగా ఆడబిడ్డలకు అండగా ఉన్నానని, తనకు కష్టం వచ్చినప్పుడు ఆడబిడ్డలు, తమ్ముళ్లు కాపాలా కాయాల్సిన బాధ్యత ఉందన్నారు.

Tags:    

Similar News