విశాఖకు వెళ్లాలని ఉంది.. మనసాగడం లేదు

గ్యాస్ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరగాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. తాను విశాఖ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరానని, అయితే ప్రభుత్వం నుంచి [more]

Update: 2020-05-08 07:59 GMT

గ్యాస్ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరగాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. తాను విశాఖ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరానని, అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాలేదన్నారు. ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమని చెప్పారు. తూతూ మంత్రంగా దర్యాప్తు చేయడం సరికాదన్నారు. కంపెనీ యాజమాన్యంపై సాధారణ కేసులు నమోదు చేయడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంక వారికి భయం ఏముంటుందని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆయా రంగనిపుణులు మాత్రమే దర్యాప్తు చేయాలన్నారు. ఇలాంటి పరిశ్రమలకు అనుమతి ఇచ్చేటప్పుడు నిబంధనలను పాటించాలన్నారు. ఇలాంటి ఘటనలను పరిశ్రమల యాజమాన్యం తేలిగ్గా తీసుకునేలా ముఖ్యమంత్రి ప్రకటన ఉందన్నారు. విశాఖకు వెళ్లలేకపోతున్నామనే నిస్సహాయతగా ఉన్నానని చంద్రబాబు చెప్పారు. ఎప్పుడు అనుమతి వస్తే అప్పుడు విశాఖ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు చెప్పారు. ఈలోపు అక్కడి టీడీపీ నేతలు ప్రజలకు భరోసా ఇస్తారని చెప్పారు. ఫ్యాక్టరీ అక్కడ మళ్లీ తెరవడానికి వీలులేదన్నారు.

Tags:    

Similar News