బాబుకు దొరకని అనుమతి.. హైదరాబాద్ నుంచి విశాఖకు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు విశాఖ వెళ్లేందుకు అనుమతి లభించలేదు. ఆయన విశాఖ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. విశాఖ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు [more]

Update: 2020-05-07 14:13 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు విశాఖ వెళ్లేందుకు అనుమతి లభించలేదు. ఆయన విశాఖ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. విశాఖ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనుమతి ఇవ్వలేదు. రేపు అనుమతి ఇచ్చే అవకాశముందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. గ్యాస్ లీక్ అయి సహాయ కార్యక్రమాలు జరుగుతుండటంతో ఈరోజు చంద్రబాబు విశాఖ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. రేపు అనుమతి లభించే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News