తెరిచే ముందు తెలియదా? ఇదేం పద్ధతి?

మద్యం దుకాణాలను హడావిడిగా తెరవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మద్యం దుకాణాల వద్ద ఉన్న క్యూలను చూసి తనకు [more]

Update: 2020-05-04 12:31 GMT

మద్యం దుకాణాలను హడావిడిగా తెరవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మద్యం దుకాణాల వద్ద ఉన్న క్యూలను చూసి తనకు ఆశ్చర్యం వేసిందన్నారు. కరోనా సమయంలో మద్యం దుకాణాలను తెరిచే ముందు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమయిందన్నారు. మద్యం దుకాణలను తెరుస్తున్నామని తెలిసి అక్కడ ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. కరోనా కేసులు మరింత పెరిగేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకపోవడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు.

Tags:    

Similar News