నేరస్థుడు సీఎం అయితే…?

నేరస్థుడు సీఎం అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఏపీలో చూస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పోలీసుల పనితీరే అందుకు నిదర్శనమని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో [more]

Update: 2019-10-01 01:22 GMT

నేరస్థుడు సీఎం అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఏపీలో చూస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పోలీసుల పనితీరే అందుకు నిదర్శనమని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో అంధకారం అలుముకుంటుందని తెలిపారు. విద్యుత్తు కోతలతో రాష్ట్రం అల్లాడుతుందన్నారు. 9గంటలు విద్యుత్తు ఇస్తామని చెప్పి అందులో సగం కూడా జగన్ సర్కార్ విద్యుత్ సరఫరాను ఇవ్వడం లేదన్నారు. జలాశయాలు నిండుతున్నా విద్యుత్తు కోతలు ఎందుకో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు చంద్రబాబు. పీపీఏ లను రద్దు చేయడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. తాము ఇచ్చిన నిరంతర విద్యుత్తుకు ఇది రివర్స్ అని చంద్రబాబు జగన్ సర్కార్ పై సెటైర్ వేశారు.

Tags:    

Similar News