మార్చే అధికారం జగన్ కు లేదు

రాజధానిని మార్చే అధికారం ముఖ్యమంత్రులకు లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి రాజధానిిని మార్చలేదన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు మాత్రం కొత్త [more]

Update: 2020-01-03 11:40 GMT

రాజధానిని మార్చే అధికారం ముఖ్యమంత్రులకు లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి రాజధానిిని మార్చలేదన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు మాత్రం కొత్త రాజధానిని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏర్పాటు చేశారంటున్నారు. కానీ జగన్ మాత్రం వితండవాదం చేస్తున్నారన్నారు. కమిటీల మీద కమిటీలు వేస్తున్నారన్నారు. రాజధాని అంటే కేవలం కార్యాలయాలను నిర్మించడం కాదని, యువత కలలను సాకారం చేసేదిగా ఉండాలన్నారు. మూడు రాజధానులు అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారన్నారు. రాజధాని కోసం పోరాడుతుంటే కేసులు పెడుతున్నారని ఆవేదన చెందారు. భవిష్యత్తులో ఏపీ రాజధాని ఏదంటే మూడు నగరాల పేరు భవిష్యత్తులో చెప్పాల్సి వస్తుందన్నారు.

అన్నీ రద్దు చేసి….

ఈరోజు అమరావతిలో హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ అన్నీ ఉన్నాయన్నారు. దాదాపు ఐదు వేల క్వార్టర్లు సిబ్బంది కోసం నిర్మించామని తెలిపారు. దాదాపు పదివేల కోట్లు ఖర్చుపెట్టామని, ఇంకో మూడు వేల కోట్లు ఖర్చు పెడితే అమరావతి దానంతట అదే అభివృద్ధి చెందుతుందన్నారు. ీఅది చేయకుండా మూడు ముక్కలు చేయడమేంటని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతులని చూడకుండా అక్రమంగా అరెస్ట్ లు చేయడమేంటని ప్రశ్నించారు. మహిళలపై ఈ దౌర్జన్యం ఏంటని చంద్రబాబు నిలదీశారు. విశాఖపట్నంను డేటాహబ్ చేయాలని తాము అనుకుంటే అదానీ గ్రూపును రద్దు చేశామన్నారు. విశాఖపట్నంలో లాలూ గ్రూపు కన్వెన్షన్ సెంటర్ ను కూడా రద్దు చేశారన్నారు. తిరుపతి కేంద్రంగా పరిశ్రమలను ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతపురంలో కియా పరిశ్రమను ఏర్పాటు చేశామని చెప్పారు. కర్నూలు లో సీడ్ క్యాపిటల్ పెట్టానుకున్నామన్నారు. కానీ జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.

Tags:    

Similar News