బాబు ఆస్తుల కేసు వాయిదా

చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు డిసెంబరు 6వ తేదీకి వాయిదా పడింది. లక్ష్మీపార్వతి నుంచి ఆధారాలు సేకరించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. పదిహేనేళ్ల క్రితం లక్ష్మీపార్వతి [more]

Update: 2019-11-25 13:16 GMT

చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు డిసెంబరు 6వ తేదీకి వాయిదా పడింది. లక్ష్మీపార్వతి నుంచి ఆధారాలు సేకరించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. పదిహేనేళ్ల క్రితం లక్ష్మీపార్వతి చంద్రబాబు అక్రమ ఆస్తులను సంపాదించారని, ఆయన ముఖ్యమంత్రిగా కోట్ల ఆస్తులను కూడబెట్టారని పిటీషన్ వేశారు. సుప్రీంకోర్టు స్టే విధించడంతో దీనిపై విచారణ జరగలేదు. ఇటీవల సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయడంతో నేడు చంద్రబాబు ఆస్తుల వివాదంపై విచారణ జరిగింది. కేసును డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News