Chandrababu : చంద్రబాబు అక్కడే నిద్రించి.. ఉదయాన్నే లేచి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష కొనసాగుతోంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన దీక్షకు దిగారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు [more]

Update: 2021-10-22 03:37 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష కొనసాగుతోంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన దీక్షకు దిగారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు జరిపిన దాడులకు నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు దీక్షా శిబిరం వద్దకు వచ్చి చంద్రబాబు సంఘీభావం తెలుపుతున్నారు.

రాత్రి అక్కడే నిద్రించి….

చంద్రబాబు దీక్ష ఈరోజు రాత్రి 8 గంటలకు ముగియనుంది. రాత్రి దీక్షాస్థలిలోనే నిద్రించిన చంద్రబాబు ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచారు. దైనిందిన కార్యకలాపాలు ముగించుకున్న తర్వాత చంద్రబాబు తిరిగి దీక్ష స్థలిలో కూర్చున్నారు. మరికాసేపట్లో చంద్రబాబుకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News