గద్దరన్న పై నెటిజన్లు గరంగరం..?

Update: 2018-11-29 07:56 GMT

ఖమ్మంలో నిన్న జరిగిన ప్రజాకూటమి సభ చారిత్రక సభ అని, తెలంగాణ ఎన్నికలతో పాటు దేశ రాజకీయాల్లోనే ప్రభావం చూపుతుందని పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. అయితే, నిన్న సో కాల్డ్ చారిత్రక సభలో జరిగిన కొన్ని పరిణామాలు, ఫోటోలు వైరల్ గా మారాయి. అందులో చంద్రబాబును గద్దర్ కౌగిలించుకున్న ఫోటో ఒకటి.

ప్రజా యుద్ధనౌక గద్దర్ ఇన్నేళ్లు ఏ అధికార పార్టీలపై పోరాడారో ఇప్పుడు అవే పార్టీలకు దగ్గరవుతున్నారు. అయితే, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడాన్ని ఎవరూ పెద్దగా తప్పు పట్టలేదు. అయితే, నిన్నటి ఖమ్మం మీటింగ్ లో గద్దర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకొని కౌగలించుకున్నారు. ఈ ఫోటో కూడా తెగ వైరల్ గా మారింది. ప్రజా హక్కుల కోసం పోరాడే గద్దర్ పై చంద్రబాబు హయాంలోనే హత్యాయత్నం జరిగింది. ఇప్పటికీ ఆయన ఒంట్లో బుల్లెట్ ఉంది. ఈ విషయాన్ని ఆయన సందర్భానుసారం గుర్తు చేస్తారు. అయితే, ఇప్పుడు అదే చంద్రబాబును గద్దర్ కౌగిలించుకోవడాన్ని కొందరు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తన పాటలతో స్ఫూర్తి పొందిన అనేక మంది యువతీయువకులు నక్సలైట్లలో చేరగా... వారిని చంద్రబాబు హయాంలో ఎన్ కౌంటర్లతో మట్టుబెట్టారని, అటువంటి చంద్రబాబు కడుపులో గద్దర్ తలపెట్టారని.. ఈ సందర్భాన్ని చూసి అమరుల ఆత్మలు ఘోషిస్తాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News